నా దృష్టి లో కోరా పడడం కాస్త ఆలస్యం అయినా కూడా, ఈ ప్లాట్ ఫామ్ ను నేను చక్కగా ఉపయోగించుకున్నాను. ప్రశ్నలకు సమాధానాలు రాయడం లో సమయజ్ఞతను, ప్రాప్త కాలజ్ఞతను పాటిస్తూ, దానికి హాస్య స్పోరకతను జోడించడం లో కృతకృత్యుడనయ్యాననే చెప్పవచ్చు. వివాదాస్పద ప్రశ్నలకు నేను ఎప్పుడూ జవాబివ్వలేదు. కోరాలో అనతి కాలంలోనే నా ప్రశ్నలకు ఆదరణ లభించింది. నేనిచ్చిన జవాబుల్లో, బాల్యం నుంచి ఇప్పటి దాకా నా జీవిత ప్రయాణం లో నేను పొందిన అనుభవాలను, అనుభూతులను పేర్కొన్నాను. అందుకే ఇవి మిమ్మల్ని ఆలోచింపజేస్తూనే నవ్విస్తాయి. ఈ జవాబుల్లో కాస్తంత గడసరితనం, కూసింత అమాయకత్వం కనిపిస్తాయి. నేను పొందిన అనుభవాలకు నేను మా అమ్మా, నాన్నకు, నా అర్ధాంగికి, మా ఊరి విశాలాంధ్రకు ఋణపడి ఉన్నాను. ఈ పుస్తకం లో నా అనుభవాలే కాక, నేను చదివిన పుస్తకాల గురించి, నేను చూసిన ప్రదేశాల గురించి, మా కళాశాల గురించి, నేను కలిసిన వ్యక్తుల గురించి ప్రస్తావించాను. ఈ పుస్తకాన్ని ఆదరించి, నన్ను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. - G S N Prasad