-వేముల ఎల్లయ్య
“జీవితం తెలిసి రాసిన రచనలు బాగుంటాయి. జీవితాలను నడిపించే శక్తుల గురించి రాసిన రచనలు మరింత బాగుంటాయి.” శీలం భద్రయ్య రాసిన “గంగెద్దు” కథలు జీవితం తెలిసి, జీవితాన్ని నడిపించే వ్యక్తులు, శక్తుల గురించి రాసిన కథలు. ఈ కథల్లో వస్తువు వైవిధ్యం, శైలిపరంగా చూసినపుడు వర్ణన, నాటకీయత, ఆఖ్యానం అనే మూడు ప్రధాన లక్షణాలున్నాయి. దీనికి తోడు అచ్చమైన తెలంగాణ నుడికారం, గ్రామీణ జీవన కళాత్మకత, ఆసక్తికర కథనం ప్రధాన భూమిక పోషించాయి. కథా రచనలో ఒక్కో రచయితకు ఒక్కో శైలి ఉంటుంది. శీలం భద్రయ్య శైలి ప్రత్యేకం. అతని “శైలీయే శీలం. శీలమే శైలి”.
- చేకూరి శ్రీనివాస రావు