జ్యోతిష్యశాస్త్రంలో వైద్యజ్యోతిష్యం ఒక భాగం. వైద్యజ్యోతిష్య సహాయంతో మీ జీవితంలో ఏయే రోగాలు ఎప్పుడెప్పుడు వస్తాయో ముందే తెలుసుకునే అవకాశం ఉన్నది. దీనిని తెలుసుకోవడం వల్ల ముందే జాగ్రత్తపడవచ్చు. అవి తలెత్తినప్పుడు వాటిని త్వరగా సులభంగా తగ్గించుకోవచ్చు. లేదా, సరియైన పరిహారాలు చెయ్యగలిగితే, ఆయా వ్యాధులను అసలే రాకుండా నివారించుకోవచ్చు.
ఈ గ్రంథంలో వైద్యజ్యోతిష్యం యొక్క మూలసూత్రాలను, వాటిని ఉపయోగించి నేను చేసిన నూరు జాతకాల, నూరు వ్యాధుల విశ్లేషణను మీరు గ్రహించవచ్చు.
శ్రీ సత్యనారాయణ శర్మ గారు జ్యోతిష్యము, యోగము, తంత్రము, వీరవిద్యలు, ప్రత్యామ్నాయ వైద్యవిధానములలో ప్రవీణులు. భారతదేశముననూ, అమెరికా సంయుక్తరాష్ట్రలలోనూ వీరు స్థాపించిన 'పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్' ప్రపంచవ్యాప్తంగా వేలాదిమందిని ఆధ్యాత్మికమార్గంలో ఉత్తేజితుల్ని చేస్తున్నది.