వేదమంత్రాన్ని పఠించేటపుడు దానిని అంతర్దృష్టితో చూసి బహిరంగ పరచిన ఋషిని గూర్చి తెలుసుకోవాలంటుంది ఆర్షసాంప్రదాయం. వేదాలసారమే శ్రీ మద్భగవద్గీత. దానిపై అద్బుతమైన ఈవ్యాసాన్ని వెలువరించినవారు రాచకొండ వెంకట నరసింహశర్మగారు. వీరిని మేమంతా “మాష్టారు” అని పిలిచేవాళ్ళం. వీరొక మహర్షి, మహాయోగి, స్థితప్రజ్ఞులు. వీరి జీవిత చరిత్ర మాకంతగా తెలియదు. తెలిసినంత వరకు సూక్ష్మంగా చెప్పటానికి చేసే ప్రయత్నమేయిది.